సగానికిపైగా కోలుకున్న కరోనా బాధితులు

కరోనా ప్రభావం సినిమా ఇండస్ట్రీపై పడింది. దీని దెబ్బకు పలు చోట్ల థియేటర్లు సైతం మూతపడ్డాయి. అంతేకాక పలు సినిమాల షూటింగ్‌లు, ప్రమోషన్‌ కార్యక్రమాలు, విడుదల వాయిదా పడ్డాయి. దీంతో  సినిమా తారలు తమకు దొరికిన ఖాళీ సమయాన్ని ప్రజల కోసం వెచ్చిస్తున్నారు. జనాల్లో కరోనా భయాన్ని తొలగించి అవగాహన కల్పించేందుకు పూనుకున్నారు. అందులో భాగంగా సోషల్‌ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటూ కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ఇందుకోసం బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, ప్రియాంక చోప్రా, కార్తీక్‌ ఆర్యన్‌, వరుణ్‌ ధావన్‌ రంగంలోకి దిగగా.. ఇప్పుడీ లిస్టులో భాగీ హీరో టైగర్‌ ష్రాఫ్‌ చేరాడు.